![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం శనివారం నాటి ఎపిసోడ్ లో టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. విష్ణుప్రియ-పృథ్వీల మధ్య ఎలిమినేషన్ రౌండ్ సాగగా తను(విష్ణుప్రియ) సేఫ్ అయ్యింది. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. పృథ్వీ ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చాక పృథ్వీకి ఓ టాస్కు ఇచ్చారు నాగార్జున.
హౌస్‌లో ముగ్గురు సూపర్ హిట్లు, ముగ్గురు సూపర్ ఫ్లాపులు చెప్పాలంటూ నాగార్జున అడిగారు. దీంతో ముందుగా నిఖిల్ సూపర్ హిట్ సర్.. టాస్కులు.. ఇంట్లో అన్నీ గుడ్ సో సూపర్ హిట్ అంటూ పృథ్వీ చెప్పాడు. తర్వాత నబీల్‌కి సూపర్ హిట్ ఇచ్చాడు. నబీల్ టాస్కులు, నామినేషన్స్ అన్నింట్లో చాలా ఇన్వాల్ మెంట్ ఉంది.. సో నబీల్‌కి కూడా సూపర్ హిట్ అంటూ చెప్పాడు. ఇక చివరి సూపర్ హిట్ విష్ణుప్రియకి ఇచ్చాడు. తను చాలా జోవియల్ అమ్మాయి.. హౌస్‌లో తనతో కలిసి చాలా ఎంజాయ్ చేశా.. తను కూడా సూపర్ హిట్ అంటూ పృథ్వీ చెప్పాడు.
ఇక ఇందులో భాగంగా మొదటగా సూపర్ ఫ్లాప్ రోహిణికి ఇచ్చాడు. మీరు ఇంకా నామినేషన్స్‌లోకి రావాలి.. మీరు అక్కడ ఉండాలా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి.. మీరు ఇప్పటివరకూ ఒక్కసారే నామినేషన్స్‌కి వచ్చారు అందుకే మీకు సూపర్ ఫ్లాప్ ఇస్తున్నానంటూ పృథ్వీ చెప్పాడు. తర్వాత అవినాష్ బ్రో.. సేమ్ రీజన్ ఒకసారే నామినేషన్‌కి వెళ్లారు.. ఎలిమినేట్ అయ్యారు.. షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు.. కనుక మీరు జనాల్లోకి వెళ్లి ప్రూ చేసుకోవాలంటూ పృథ్వీ అన్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ అందరూ బాగా ఆడండి.. కానీ నేను నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియకి ఓటేస్తానంటూ పృథ్వీ అన్నాడు. ఇంతమందికి ఎలా వేస్తావయ్యా అంటూ నాగార్జున అడుగగా.. అవును సర్ నాలుగు మొబైల్స్ తీసుకొని ఓట్ చేస్తానంటూ పృథ్వీ చెప్పాడు.
![]() |
![]() |